గుండె జబ్బుతో బాధపడుతున్న 'మెగా' మహిళా అభిమానికి సర్జరీ.. చిరంజీవి స్పందన!
- గుంటూరుకు చెందిన నాగలక్ష్మికి హృద్రోగం
- హైదరాబాదులో శస్త్రచికిత్స
- డాక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓ మహిళా అభిమాని పరిస్థితి పట్ల ట్విట్టర్ లో స్పందించారు. "గుంటూరుకు చెందిన రాజనాల నాగలక్ష్మి ఎంతో కాలంగా నా అభిమాని. ఆమె గుండెజబ్బుతో బాధపడుతోంది. మూడు హార్ట్ వాల్వులు మూసుకుపోయాయి. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో డాక్టర్ గోపీచంద్ దాదాపు మూడున్నర గంటలపాటు శ్రమించి అంత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించారు. నా అభిమాని నాగలక్ష్మి ప్రాణాలు కాపాడిన డాక్టర్ గోపీచంద్ కు రుణపడి ఉంటాను.
ఈ సందర్భంగా నాగలక్ష్మిని గుంటూరు నుంచి హుటాహుటీన హైదరాబాద్ తరలించిన బి.దిలీప్ కు, నాగలక్ష్మి విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చిన స్వామినాయుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పరిస్థితిని అర్థం చేసుకుని అనుమతులు ఇచ్చిన పోలీసు అధికారులందరికీ కృతజ్ఞతలు. నిజమైన దేవతలంటే మీరే" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
కాగా, ఇటీవల నాగలక్ష్మి అనారోగ్య పరిస్థితి తెలియగానే చిరంజీవి స్వయంగా డాక్టర్ గోపీచంద్ తో మాట్లాడి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయించారు. అలాగే ఈ రోజు సర్జరీ విజయవంతంగా ముగిసిన వెంటనే ఆ విషయాన్ని ముందుగా డాక్టర్ గోపీచంద్ చిరంజీవికి ఫోన్ చేసి తెలియజేశారు.