నిజాముద్దీన్‌ సభలో పాల్గొని ఈ రోజు మలేషియా వెళ్లిపోబోయిన 8 మందిని పట్టుకున్న పోలీసులు

  • వీసా నిబంధనలు ఉల్లంఘించిన విదేశీయులు
  • ఇన్ని రోజులు ఢిల్లీలో పలు చోట్ల దాక్కున్న వైనం
  • సెల్‌ఫోన్‌లను ట్రేస్‌ చేసి పట్టుకున్న పోలీసులు
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన మలేషియా వాసులు
ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మలేషియా వెళ్లడానికి ప్రయత్నించిన ఎనిమిది మంది మలేషియా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న వారేనని తెలిసింది.

ఆ సభకు హాజరైన వారికి కరోనా సోకడంతో అందరూ క్వారంటైన్‌కు రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎనిమిది మంది మలేషియా వాసులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులకు కనపడకుండా తలదాచుకున్నారు. ఈ రోజు వారంతా బయటకు వచ్చి విమానాశ్రయంలో చిక్కారు.

వారి సెల్‌ఫోన్‌ డేటాలను పోలీసులు ట్రేస్‌ చేయగా ఈ విషయం బయటపడింది. వీసా నిబంధనలను ఉల్లంఘించి వారంతా మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి 960 మంది విదేశీయులను బ్లాక్‌లిస్టులో పెట్టి వారి భారతీయ వీసాలను రద్దు చేసింది.  


More Telugu News