కరోనా పాజిటివ్ వచ్చిన వారి నివాస స్థలాలు ఐసోలేషన్‌లో పెట్టాం: వివరాలు తెలిపిన ఏపీ ప్రభుత్వం
- కరోనా పేషెంట్లతో కలిసి ఉన్న వారందర్నీ క్వారంటైన్ కి తరలించాం
- పేషెంట్ నం.41 నుంచి 130 వరకు వివరాలు ఇస్తున్నాం
- ట్విట్టర్‌లో వివరాలు పోస్ట్ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మరిన్ని పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇళ్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
'రాష్ట్రంలో పాజిటివ్‌గా నిర్ధారించబడిన పేషెంట్స్ నివాస స్థలాలు ఐసొలేషన్ లో పెట్టబడ్డాయి. వారితో కలిసి ఉన్న వారందర్నీ క్వారంటైన్ కి తరలించాం. పేషెంట్ నం.41 నుంచి 130 వరకు పాజిటివ్ వచ్చిన వాళ్ల నివాస స్థలాలు ఇస్తున్నాం' అని ఏపీ ప్రభుత్వ 'ఆరోగ్య ఆంధ్ర' అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 190 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.