పోలీసులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు: యూపీ ప్రభుత్వం

  • లాక్ డౌన్ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • పోలీసులపై దాడి చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
  • ఎన్ఐఏ చట్టాన్ని ప్రయోగించాలని ఆదేశం
కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల భద్రతకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులపై ఎవరైనా దాడి చేస్తే... అలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. పోలీసులపై దాడి చేసే వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులను నమోదు చేయాలని ఆదేశించింది.


More Telugu News