నేడు శ్రీరామ నవమి.. ఆలయాల వద్ద కనిపించని సందడి!

  • భక్తులు లేక బోసిపోయిన రామాలయాలు
  • నేటి ఉదయం తిరుమలలో సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం
  • రేపు రాత్రి పట్టాభిషేకం
కరోనా రక్కసి దేశంలోకి, తెలుగు రాష్ట్రాల్లోకి జొరబడకుండా ఉండి వుంటే నేడు శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగి ఉండేవి. వాడవాడనా ఉండే రామాలయాలు భక్తులతో కిటకిటలాడేవి. మధ్యాహ్నం అన్న ప్రసాదాల వితరణతో సందడిగా మారేవి. కానీ ఈ మహమ్మారి కారణంగా.. ఎటువంటి ఆర్భాటాలు, సందడి లేకుండానే శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థాన వేడుక నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. రేపు రాత్రి 8 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. వైరస్ కలవరపెడుతుండడంతో ఈ వేడుకలన్నీ ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.


More Telugu News