దేశంలో మరిన్ని పెరిగిన కరోనా కేసులు

  • ప్రకటించిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ
  • 1,353 మందికి కరోనా
  • ఇప్పటివరకు కరోనాతో 32 మంది మృతి
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మరిన్ని పెరిగాయి. ఇప్పటివరకు 1,353 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 32 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

కాగా, తెలంగాణలో కరోనాతో ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటన చేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని, వారిలో తెలంగాణకు చెందిన వారూ ఉన్నారని తెలిపింది. వారి ద్వారా వైరస్‌ సోకే అవకాశమున్న అనుమానితులను గుర్తిస్తున్నట్లు వివరించింది. అనుమానితులను ప్రత్యేక బృందాలుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నామని తెలిపింది. ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారంతా తమకు సమాచారమివ్వాలని కోరింది.


More Telugu News