మహారాష్ట్రలో ‘కరోనా’ బారిన పడ్డ మహిళల కోసం ప్రత్యేక ఆసుపత్రులు
- మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్
- రాష్ట్రంలో 147 మందికి కరోనా
- బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడి
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 147 మందికి ‘కరోనా’ సోకింది. ఇక ఈ వైరస్ బారిన పడిన మహిళల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటన చేశారు. మెటర్నిటీ కేంద్రాలకు సమీపంలో వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. మహిళల కోసం నిర్మించబోయే ఈ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, 100 పడకలు ఉంటాయని వివరించారు.