పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.. అర్థం చేసుకోండి: ఏపీ మంత్రి పేర్ని నాని
- లాక్ డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య
- ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు
- అందరం కలిసి కరోనాను జయిద్దాం
ఏపీలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేని కొందరు యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా సూచనలు చేశారు. లాక్ డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అని... అలాంటి తీవ్ర నిర్ణయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కోరారు. దయచేసి ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని విన్నవించారు. అందరం కలిసి కరోనాను జయిద్దామని చెప్పారు.