అలా ఒక్కో సినిమా చేస్తూ ఇంతవరకు వచ్చాను: హీరో సుధీర్ బాబు

  • నేను పుట్టిపెరిగింది విజయవాడలో 
  •  నా తొలి చిత్రం 'ఎస్సెమ్మెస్'
  • తనపై ఆడియన్స్ కి నమ్మకం వచ్చిందన్న సుధీర్ బాబు  
తెలుగులో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, యువ కథానాయకులతో సుధీర్ బాబు పోటీ పడుతున్నాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "నేను పుట్టిపెరిగింది విజయవాడలో .. మొదటి నుంచి కూడా సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మా నాన్నగారు వ్యాపార రీత్యా హైదరాబాద్ వచ్చేశాక, సినిమాల్లో హీరోగా ట్రై చేయాలనే ఆలోచన వచ్చింది.

దాంతో ముందుగా అందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేసి, ఆ తరువాత రంగంలోకి దిగాను. నా మొదటి సినిమా 'ఎస్సెమ్మెస్' బాగానే ఆడింది. ఆ తరువాత చేసిన ' ప్రేమకథా చిత్రం' మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా చూసినవాళ్లు, ఈ కుర్రాడు నిలదొక్కుకుంటాడు అనుకున్నారు. అలా ఒక్కో సినిమా చేస్తూ ఇంతవరకూ వచ్చాను" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News