ఈ నెలాఖరు వరకు బస్సులు తిరగవు: పేర్ని నాని
- ఏపీలో లాక్ డౌన్
- మార్చి 31 వరకు ఆర్టీసీ సర్వీసులు నిలిపివేస్తున్నామని వెల్లడించిన నాని
- ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి
కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరగవని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని చెప్పారు. అంతర్రాష్ట్ర బస్సులను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. కరోనా నివారణ చర్యలకు ప్రజలంతా సహకరించాలని సూచించారు. అంతకుముందు సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయాలు వెల్లడిస్తామని చెప్పారు.