దేశంలో కరోనాతో మరో మరణం.. భారత్‌లో మరిన్ని పెరిగిన కరోనా కేసులు
- కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరిందన్న కేంద్రం
- మహారాష్ట్రలో మరొకరి మృతి
- 5కి చేరిన కరోనా మృతుల సంఖ్య
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. కరోనాతో మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఓ వ్యక్తి (63) గత రాత్రి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ఈ రోజు తెలిపారు.
దీంతో దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరింది. మహారాష్ట్రలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది. మహారాష్ట్రలో ఈ రోజు ఒక్కరోజే పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 74కి చేరింది. దేశంలో అత్యధిక కేసులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి.