దేశంలో కరోనా నుంచి కోలుకున్న 20 మంది
- దేశంలో 195కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- ఇప్పటివరకు నలుగురి మృతి
- మహారాష్ట్రలో 52కి చేరిన కరోనా కేసులు
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20 మంది కోలుకున్నారు. పలు ఆసుపత్రుల్లో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కరోనా బాధితులకు వైద్యులు సమర్థవంతంగా చికిత్స అందిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య 195కు చేరింది. దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.
కరోనా వల్ల వృద్ధులకే అధిక ముప్పు ఉంటుంది. కరోనా నెగిటివ్ అని తేలిన వారిని వైద్యులు వెంటనే డిశ్చార్జ్ చేస్తున్నారు. కాగా, కరోనా బాధితులు అధికంగా ఉన్న మహారాష్ట్రలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసులు 52కి చేరాయి.