తాను చెప్పింది జరగకపోతే జగమొండి భరించలేడు: చంద్రబాబు

  • టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌
  • దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొన్న అందరికీ అభినందనలు
  • రాష్ట్రంలో సాధారణ పాలన పడకేసింది
  • రాష్ట్రంలో విధ్వంస, విపక్ష పాలన నడుస్తోంది
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌ తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలతో చంద్రబాబు ఈ రోజు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై అన్ని జిల్లాల్లో ఎస్పీలు, కలెక్టర్‌లకు వినతులివ్వాలని చెప్పారు.

నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపజేసిన ఘటనలపై ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు. నేతల వద్దనున్న సాక్ష్యాలు ఎన్టీఆర్‌ భవన్‌కు పంపాలని చెప్పారు. దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొన్న అందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సాధారణ పాలన పడకేసిందని, విధ్వంస పాలన నడుస్తోందని తెలిపారు. తాను చెప్పింది జరగకపోతే జగమొండి భరించలేడని విమర్శించారు.


More Telugu News