జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
- ప్రపంచాన్ని ‘కరోనా’ గడ గడ లాడిస్తోంటే ఏం ప్రమాదం లేదంటారా?
- ఇరాన్ లో కూడా ఓ మంత్రి ఇలాగే మాట్లాడారు!
- రాష్ట్ర ప్రయోజనాలు జగన్ కు పట్టవు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడ లాడిస్తోంటే, ఏం ప్రమాదం లేదని చెబుతున్న జగన్ మాదిరిగానే ఇరాన్ లో ఓ మంత్రి కూడా మాట్లాడారంటూ ఆయన ప్రసంగ వీడియోను చూపించారు. ‘ముఖ్యమంత్రికి బుద్ధి, ఆలోచన అనేవి ఉంటే’ ఈ వార్త చదవాలని, సంబంధిత వీడియో చూడాలంటూ తీవ్ర విమర్శలు చేశారు.
‘కరోనా’ వ్యాప్తి గురించి తేలికగా మాట్లాడిన ఇరాన్ మంత్రి, కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వైరస్ బారినపడి, ఆసుపత్రిలో చేరారని, ఈ వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుందని చెబుతూ తన తప్పును ఆయన ఒప్పుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ‘కరోనా’ గురించి తేలికగానే మాట్లాడినా, ఆ తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో చర్యలు చేపట్టారని అన్నారు. ‘కరోనా’పై జగన్ ఒక్కరోజు సమీక్ష నిర్వహించలేదని, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేదని, రాజకీయ ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవని మండిపడ్డారు.