ప్రపంచవ్యాప్తంగా 5 వేలు దాటిన కరోనా మరణాలు

  • కరోనాతో 5,043 మంది మరణించారన్న ఏఎఫ్ పీ మీడియా సంస్థ
  • కరోనా బారిన 121 దేశాలు
  • 1.34 లక్షల మందికి కరోనా
ప్రపంచం మొత్తమ్మీద దాదాపు 90 శాతం భూభాగంపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. చైనా, అమెరికా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ సహా అనేక దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా, ఏఎఫ్ పీ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 5,043గా నమోదైంది.

చైనా ప్రధాన భూభాగంలో 3,176 మంది మృత్యువాత పడగా, ఇటలీలో 1,016 మంది చనిపోయారు. ఇరాన్ లోనూ 514 మంది ఈ మహమ్మారికి బలైనట్టు గుర్తించారు. కరోనా మొట్టమొదటిగా గత డిసెంబరులో వెల్లడైంది. మొత్తం 121 దేశాలు కరోనా బారినపడగా, 1,34,300 మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు తెలిసింది.


More Telugu News