కొత్త జంట రొమాంటిక్ మూడ్ లో ఉన్న వేళ... ఓ జిరాఫీ చేసిన పనిని చూడండి!
- కాలిఫోర్నియాలో అమీశ్, మేఘనలకు వివాహం
- ఫొటోలకు పోజులిస్తుంటే తలపాగా లాగేసిన జిరాఫీ
- వైరల్ అవుతున్న వీడియో
అప్పుడే వివాహమైన ఓ జంట, రొమాంటిక్ మూడ్ లో ఫొటో షూట్ కు రెడీ అయిన వేళ, ఆ ప్రాంతంలోనే ఉన్న ఓ జిరాఫీ, వారిని కాస్తంత ఇబ్బంది పెట్టింది. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. భారత సంతతికి చెందిన అమీశ్, మేఘనాలకు వివాహం వైభవంగా జరుగగా, వారిద్దరూ ఫొటోలు తీయించుకునేందుకు మలీబు ప్రాంతంలోని సాడల్ రాక్ వద్దకు వెళ్లారు.
అక్కడ వీరిద్దరూ పోజులిస్తుండగా, పక్కనే ఉన్న ఫెన్సింగ్ వెనుక ఉన్న ఓ జిరాఫీ వారి వద్దకు వచ్చింది. అది ఏమైనా ఆకలితో వుందేమో... వరుడి తలపాగాను పట్టుకుంది. దీన్ని గమనించిన వధువు సిగ్గుపడుతూ జిరాఫీని వారించే ప్రయత్నం చేసినా, అది వినలేదు. ఈలోగా మరో వ్యక్తి వచ్చి, తలపాగాను జిరాఫీ నోటి నుంచి లాగేసి వరుడికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.