కమ్ముకొస్తున్న కరోనా... అయినా ఒలింపిక్స్ కు ఢోకాలేదంటున్న జపాన్!
- టోక్యో వేదికగా జులై 24 నుంచి ఒలింపిక్స్-2020
- అనేక దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్
- ఒలింపిక్స్ యథావిధిగా నిర్వహిస్తామన్న టోక్యో గవర్నర్
జపాన్ రాజధాని టోక్యో మహానగరం వేదికగా ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా, కరోనా భూతం కారణంగా అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు మోగిస్తుండడంతో ఒలింపిక్స్ నిర్వహణ సజావుగా సాగేనా అన్న సందేహాలు బయల్దేరాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాపోటీలు వాయిదాపడ్డాయి.
ఈ నేపథ్యంలో, టోక్యో గవర్నర్ యురికె కొయేకే ఒలింపిక్స్ నిర్వహణపై ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది టోక్యో ఆతిథ్యమిస్తున్న సమ్మర్ ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే జరుపుతామని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒలింపిక్స్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు చేయాలని భావించడం లేదని అన్నారు. అటు, ఐఓసీ (అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) కూడా అథ్లెట్లు యథావిధిగా ఒలింపిక్స్ కోసం సాధన కొనసాగించాలని సూచించింది.