సరికొత్త రూ.250 నాణెం.. రాజ్యసభలో విడుదల!

  • రాజ్యసభ 250 సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపకల్పన
  • పది గ్రాముల వెండితో తయారీ
  • కేవలం రాజ్యసభ సభ్యులకు పంచేందుకే.. ప్రజల కోసం కాదన్న ఆర్బీఐ
రాజ్యసభ 250వ సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిజర్వు బ్యాంకు రూ.250 విలువైన సరికొత్త నాణాన్ని విడుదల చేసింది. పది గ్రాముల వెండితో ప్రత్యేకంగా దీనిని రూపొందించారు. ముందువైపు సారనాథ్ సింహాల చిత్రం, కాయిన్ విలువను ముద్రించగా.. వెనుకవైపు రాజ్యసభ 250 సెషన్, గాంధీ బొమ్మను, 250 చుక్కలను ముద్రించారు. దానిని గురువారం రాజ్యసభలో సభ్యులకు పంపిణీ చేశారు.

ప్రజా వినియోగం కోసం కాదు

దేశంలో రాజ్యసభ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్నవి 250వ సమావేశాలు. దీనికి గుర్తుగా ప్రత్యేకంగా రూ.250 నాణాలను ముద్రించామని రిజర్వు బ్యాంకు అధికారులు తెలిపారు. అవి ప్రజల సౌకర్యం కోసం కాదని, వాటిని సాధారణ వినియోగం కోసం విడుదల చేయడం లేదని వెల్లడించారు.


More Telugu News