జడ్చర్ల జాతీయ రహదారిపై లారీ బీభత్సం.. ముగ్గురి మృతి

  • మరో ఇద్దరికి తీవ్రగాయాలు 
  • అదుపుతప్పి ఇంట్లోకి దూసుకువెళ్లిన వాహనం 
  • పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పిన ఓ లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకువెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా వస్తున్న లారీ ఈ ఇంటికి సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసేలోగానే పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకుపోవడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో స్థానికంగా కలకలం రేగింది.



More Telugu News