బంగ్లాదేశ్‌లో మూడు కరోనా కేసులు.. పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ

  • 17న షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంతి వేడుకలు
  • కరోనా భయంతో వాయిదా వేయాలని బంగ్లాదేశ్ నిర్ణయం
  • మోదీ బ్రసెల్స్ పర్యటన కూడా రద్దు
భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న మోదీ బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా ఆ దేశంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

 ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు బంగ్లాదేశీయులకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శత జయంతి వేడుకలను వాయిదా వేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ అబ్దుల్ చౌదరి తెలిపారు. కాగా, ఈ నెల 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో నిర్వహించనున్న ఇండో-ఈయూ సదస్సుకు కూడా మోదీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.


More Telugu News