అర్హ లక్కీ చాన్స్ కొట్టేసింది... నాకు ఆ చాన్స్ రావడానికి 23 ఏళ్లు పట్టింది: అల్లు అర్జున్

  • నిఖిల్ కొత్త సినిమా ఓపెనింగ్ కు హాజరైన అల్లు అర్హ
  • తాత అల్లు అరవింద్ తో కలిసి సందడి చేసిన సెలబ్రిటీ చిన్నారి
  • అల్లు అర్జున్ పుత్రికోత్సాహం
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ తన కుమార్తె అర్హ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. అర్హ ఇవాళ హీరో నిఖిల్ కొత్త ప్రాజెక్టు '18 పేజీస్' ముహూర్తం షాట్ కు తన తాత అల్లు అరవింద్ తో కలిసి చీఫ్ గెస్టుగా హాజరైంది. ఈ సందర్భంగా అర్హ చేసిన సందడి అంతాఇంతా కాదు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ, అర్హ చాలా అదృష్టవంతురాలని పేర్కొన్నారు. చిన్న వయసులోనే ఓ సినిమా ఓపెనింగ్ షాట్ కు ముఖ్య అతిథిగా వెళ్లే అవకాశం దక్కించుకుందని తెలిపారు. అదే తన విషయానికొస్తే ఓ సినిమా ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ హోదాలో హాజరయ్యేందుకు 23 ఏళ్లు పట్టిందని చమత్కరించారు. అంతేకాదు, కొత్త సినిమాలో నటిస్తున్న నిఖిల్ కు శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News