ఏపీలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు

  • సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు
  • తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్‌ తీరం వరకు ద్రోణి
  • తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు
ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల నిన్న సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలోని కర్నూలులో 37 డిగ్రీలు, అనంతపురంలో 36 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, గన్నవరంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్‌ తీరం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని అక్కడక్కడ వర్షాలు కురిశాయి. తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో నేడు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.


More Telugu News