భేటీ అయిన ఏపీ కేబినెట్‌.. కీలక అంశాలపై చర్చ

  • స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ
  • హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెలలోనే ఎన్నికలు 
  • బీసీ రిజర్వేషన్ల కుదింపుపై చర్చ?
  • ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాల కేటాయింపుపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్ల కుదింపుపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాల కేటాయింపుపై కీలక చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. పురపాలికలకు సమీపంలోని పంచాయతీల విలీనం, కొత్త పంచాయతీల ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.


More Telugu News