కార్యరూపం దాల్చిన వంశపారంపర్య అర్చకత్వంపై జీవో
- తొలి నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- ప.గో.లోని మదన గోపాలస్వామి ఆలయ అర్చకుడి తిరిగి నియామకం
- రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఏపీలో వంశపారంపర్య అర్చకత్వంపై జారీ చేసిన జీవో 439 నేడు కార్యరూపం దాల్చింది.
ఈ ఉత్తర్వులను అనుసరించి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం వల్లిపాడు గ్రామానికి చెందిన వంశపారంపర్య అర్చకుడిని మదన గోపాలస్వామి ఆలయ అర్చకుడిగా తిరిగి నియమించారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఈ నియామక పత్రాన్ని ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సవరించి అమల్లోకి తెచ్చారని, అధికారంలోకి రాగానే బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని జగన్ చాటుకున్నారని, వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించే జీవోను సవరించారని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం ఆదేశించారని, అందులో భాగంగా అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు.