షిప్ లో వున్న మరో ఇండియన్ కు కరోనా వైరస్!
- జపాన్ షిప్ లో కొత్తగా 79 మందికి వైరస్
- ఇప్పటివరకు 8 మంది భారతీయులకు వ్యాప్తి
- షిప్ లోని వైరస్ బాధితుల్లో ఇద్దరి మృతి
జపాన్ సముద్ర జలాల్లో ఉన్న డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో ఉన్న భారతీయులలో మరొకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా బారిన పడిన భారతీయుల సంఖ్య ఎనిమిది మందికి పెరిగినట్టు జపాన్ అధికారులు ప్రకటించారు. మొత్తంగా షిప్ లో కొత్తగా 79 మందికి కరోనా వైరస్ సోకినట్టు చెప్పారు. కరోనా సోకిన భారతీయులను సముద్ర తీరంలో ఉన్న క్వారంటైన్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తున్నామని, వారు కోలుకుంటున్నారని తెలిపారు.