నేను అతిగా ప్రవర్తించాను.. క్షమించండి: అమితాబ్‌ను క్షమాపణలు కోరిన అమర్‌సింగ్
- గతంలో నేను అతిగా ప్రవర్తించాను
- మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి
- అంపశయ్యపై నుంచి వీడియో విడుదల చేసిన అమర్‌సింగ్
మృత్యువుతో పోరాడుతున్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్ బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను క్షమాపణలు కోరారు. అమితాబ్ కుటుంబంతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అమర్‌సింగ్ గతంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బచ్చన్‌ది సిగ్గులేని కుటుంబంగా, వేషాలు వేసుకునే కుటుంబంగా అభివర్ణించారు.
ప్రస్తుతం మరణశయ్యపై ఉన్న అమర్‌సింగ్.. అమితాబ్ కుటుంబానికి ఓ వీడియో సందేశం పంపారు. గతంలో అమితాబ్, ఆయన కుటుంబం పట్ల తాను చేసిన అతి ప్రవర్తనకు చింతిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం జీవన్మరణ సమస్యతో పోరాడుతున్న తాను అమితాబ్, ఆయన కుటుంబాన్ని క్షమాపణలు వేడుకుంటున్నట్టు తెలిపారు. అమితాబ్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నట్టు అమర్‌సింగ్ పేర్కొన్నారు.
తన తండ్రి వర్ధంతి సందర్భంగా అమితాబ్ నుంచి వచ్చిన సందేశం అందుకున్న తర్వాత అమర్‌సింగ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో గతంలో తన అనుచిత ప్రవర్తనకు క్షమించాలని అమితాబ్‌ను వేడుకున్నారు.
<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FAmarSinghViews%2Fvideos%2F359559048260848%2F&show_text=0&width=560" width="560" height="308" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>