అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే!: కర్నూలులో ఏపీ సీఎం జగన్
- మార్చి 1 నుంచి అవ్వాతాతలకు కంటి ఆపరేషన్లు
- అవసరమైన చోట కొత్త ప్రభుత్వాసుపత్రులను నిర్మిస్తాం
- డాక్టర్ లేడన్న వ్యాఖ్య లేకుండా చేస్తాం
అవసరమైన చోట కొత్త ప్రభుత్వాసుపత్రులను నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కర్నూలులో మూడో దశ 'వైఎస్‌ఆర్ కంటివెలుగు' కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రంలో 66 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. లక్షన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు ఇచ్చామని చెప్పారు.
అవ్వాతాతలకు (వృద్ధులకు) ఎంత చేసినా తక్కువే అని చెప్పే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని తానేనని జగన్ అన్నారు. మార్చి 1 నుంచి అవ్వాతాతలకు కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించారు. వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అవ్వాతాతలకు కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు.
పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్ లేడన్న వ్యాఖ్య లేకుండా చేస్తామని జగన్ చెప్పారు. రూ.15,337 కోట్లతో ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతామని తెలిపారు. నర్సింగ్ కాలేజీలు కూడా పెంచుతామని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా కృషి చేస్తామని చెప్పారు.
గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రూ.15,337 కోట్లతో ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దుతామని తెలిపారు.