మార్కెట్లోకి బీఎస్-6 తో కూడిన ‘బజాజ్ పల్సర్ 150 బైక్’
- రెండు వేరియంట్లలో లభ్యం
- పల్సర్ 150 ధర రూ.94,956
- ట్విన్ డిస్క్ వేరియంట్ ధర రూ.98,835
ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ తాజాగా బీఎస్- 6 ప్రమాణాలకనుగుణంగా సరికొత్త బైక్ ను భారతీయ మార్కెట్లోకి ఈ రోజు తీసుకొచ్చింది. యువతను ఆకట్టుకునేలా ఈ మోడల్ ను తీర్చిదిద్దినట్టు కంపెనీ బైక్ డివిజన్ ప్రెసిడెంట్ సరంగ్ కసడే వెల్లడించారు. బజాజ్ పల్సర్ 150 బీఎస్-6 బైక్ ప్రారంభ ధర (ఢిల్లీ ఎక్స్ షోరూం) రూ.94, 956గా నిర్ణయించినట్లు తెలిపారు.
రెండు వేరియంట్లలో ఈ బైక్ లభ్యమవుతుందన్నారు. పల్సర్ 150 ధర రూ.94,956 గా ఉండగా, ట్విన్ డిస్క్ వేరియంట్ ధర రూ.98,835గా కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని బీఎస్-6 వాహనాలను తీసుకురానున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. బీఎస్ 4 వాహనాలతో పోలిస్తే.. బీఎస్ 6 ద్విచక్రవాహనాల ధర దాదాపుగా తొమ్మిదివేల రూపాయలు ఎక్కువగా ఉంటుందని చెప్పారు.