సహకార సంఘాల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థిపై రాళ్లదాడి

  • నల్లగొండలో ఘటన
  • ఆసుపత్రికి తరలింపు
  • ఈ నెల 15న ఎన్నికలు
  • పలు చోట్ల ఘర్షణలు
తెలంగాణలో ఈ నెల 15వ తేదీన  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న ఓ అభ్యర్థిపై దాడి జరగడం నల్లగొండ జిల్లాలోని చిట్యాల పట్టణంలో కలకలం రేపింది. కాంగ్రెస్‌ 3వ వార్డు అభ్యర్థిగా పోటీచేసిన గోధుమ గడ్డ జలందర్‌రెడ్డిపై కొందరు రాళ్లదాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

జలందర్‌రెడ్డి ముఖం. ఉదర భాగంలో తీవ్రగాయాలు కావడంతో అతడిని వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే,  ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడిపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. చిట్యాలలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ అభ్యర్థుల ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలోని 906 ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాల (పీఏసీఎస్‌- ప్యాక్‌)కు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రేజు సాయంత్రం ఫలితాలు వెల్లడవుతాయి.


More Telugu News