: పోలీసు స్టేషన్ పై నుంచి దూకేసిన యువకులు


పోలీసుస్టేషన్ పైనుంచి ఇద్దరు యువకులు దూకేశారు. ఈమధ్య కాలంలో యువకులు టవర్లు, ట్యాంకులు ఎక్కి దూకుతుంటే వీరు మాత్రం సరాసరి శాంతిభద్రతలను పరిరక్షించే చేర్యాల పోలీసు స్టేషన్ భవనంపై నుంచే దూకేశారు. వరంగల్ జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నలుగురు యువకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా, అవమానభారంతో ఇద్దరు యువకులు సదరు పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకేశారు. ఆసుపత్రిలో చేరిన వీరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

  • Loading...

More Telugu News