: షారూక్ ఖాన్ కు మూడో సంతానం నిజమే!


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, ఆయన శ్రీమతి గౌరీఖాన్ ముచ్చటగా మూడో బిడ్డకు తండ్రయ్యారు. అద్దె గర్భం ద్వారా షారూక్ దంపతులు మరో సంతానాన్ని పొందినట్లు గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వదంతులు నిజమేనని నిరూపితం అయింది. షారూక్ దంపతులు దీనిపై నోరు విప్పని సంగతి తెలిసిందే. బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) వైద్యాధికారి అరుణ్ బమ్నే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలో జనన, మరణాల వివరాలు సాధారణంగా బీఎంసీకి అందుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే మే 27న అంధేరి ప్రాంతంలోని మస్రాని ఆస్పత్రిలో ఒక మగశిశువు కన్నుతెరిచింది. షారూక్ ఖాన్, గౌరీ షారూక్ ఖాన్ ఆ శిశువుకు తల్లిదండ్రులుగా ఆస్పత్రి నుంచి అందిన వివరాలలో ఉంది. 34 వారాల అనంతరం పుట్టిన ఆ బాబు బరువు 1.5కేజీలు ఉన్నట్లుగా అందులో పేర్కొన్నారని డాక్టర్ అరుణ్ బమ్నే చెప్పారు. షారూక్ దంపతుల అద్దె గర్భం సంతానం గురించి ఈ నిదర్శనాలు సరిపోతాయేమో! దీనిపై షారూకే స్పందించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News