: హోరాహోరీ పోరులో శ్రీలంక 135 పరుగులు


రెండు జట్లు ఓటమి శిరో భారంతో కుంగిపోయాయి. ఆతిధ్య దేశాలైన టీమిండియా, శ్రీలంక టోర్నీలో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో హోరాహోరీగా పోరాడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించి, ఫీల్డింగ్ ఎంచుకుని తన ఉద్దేశ్యమేంటో చెప్పకనే చెప్పింది. అయితే టీమిండియాకు దీటైన టార్గెట్ అప్పగించేందుకు శ్రీలంక సిద్దమైంది. అందులో భాగంగా ఓపెనర్లు ఓపికగా భారత బౌలింగ్ దాడిని తిప్పికొడుతున్నారు. దీంతో 28 ఓవర్లలో శ్రీలంక వికెట్లేమి నష్టపోకుండా 135 పరుగులు చేసింది. భారత్ బౌలర్లందరినీ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. తరంగ 57 పరుగులతోనూ, జయవర్ధనే 72 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. గాయంతో ధోనీ వైదొలగడంతో కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News