: అవన్నీ తప్పుడు కధనాలే: సోనాక్షీసిన్హా
తాను నటించే సినిమాల్లో తన తల్లి పూనమ్ సిన్హా జోక్యం చేసుకుంటుందంటూ వచ్చిన కధనాలు పూర్తిగా అవాస్తవమని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీసిన్హా తెలిపింది. ముంబైలో 'లుటేరా' సినిమా ప్రమోషన్ లో సోనాక్షి మాట్లాడుతూ, లుటేరాలో రణ్వీర్ సింగ్ తో నటించిన కొన్ని సన్నివేశాల్లో తన తల్లి జోక్యం చేసుకుందనడం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తన నటనలోని లోటుపాట్లు తన తల్లికి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియవని సోనాక్షి చెప్పింది. తన పనిలో ఆమె తలదూర్చదని, ఆమెకు తలవంపులు తెచ్చే పని తాను చేయనని ఈ సందర్భంగా సోనాక్షి సిన్హా తెలిపింది. 50 వ దశకం నాటి కధాంశంతో 'లుటేరా' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, సోనాక్షీ సిన్హా జంటగా నటించగా విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించారు.