: 70వేల బంగారు తల్లులు చనిపోయారు: సీఎం
బంగారు తల్లులను(ఆడశిశువులను) చంపడం హేయమని, సమాజానికి వ్యతిరేకమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2005 నుంచి 2011వరకు 70వేల మంది బంగారు తల్లులు చనిపోయారని తెలిపారు. వీరిని బలవంతంగా చంపే హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. మార్పు ఇంటి నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని లలిత కళాతోరణంలో బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.