: భానుడు మళ్ళీ రెచ్చిపోతాడట!
రాష్ట్రంలో మరోసారి వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రం కానున్నాయి. వర్షాలు తగ్గడంతో ఎండలు ఎక్కువవుతాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. రుతుపవనాలు క్రియాశీలకంగా లేకపోవడమే భానుడి తీవ్రత పెరిగేందుకు కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడు పశ్చిమదిశ నుంచి వీచే వేడిగాలులు కూడా వాతావరణాన్ని క్రమంగా వేడెక్కెస్తాయని అధికారులు అంటున్నారు.