: బ్యాక్టీరియాను నిమిషాల్లో గుర్తించొచ్చు


బ్యాక్టీరియాను గుర్తించడానికి వారాలకొద్దీ పరీక్షలు చేయాల్సి వస్తుంది. అయితే ఒక చిన్న పరికరం బ్యాక్టీరియాను నిమిషాల్లో గుర్తించేస్తుంది. ఇలాంటి కొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అంతేకాదు, ఈ పరికరాన్ని పలు వైద్యపరీక్షల్లో కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే ఒక పరికరాన్ని బ్యాక్టీరియా గుర్తించేందుకు రూపొందించారు.

ఈ పరికరం యాంటీబయాటిక్‌ మందుల ద్వారా బ్యాక్టీరియాకు సరైన చికిత్స జరిగిందా? లేదా? అనే విషయాన్ని గుర్తించేందుకు ఉపయోగించవచ్చు. అలాగే ఔషధాలతో నిరోధక గుణమున్న సూక్ష్మజీవుల విషయంలో ఇది చాలా కీలకం కానుంది. కేన్సర్‌ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ పరీక్షలో కూడా దీన్ని వాడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరంలో బ్యాక్టీరియా క్రియాశీలతను గుర్తించే నానోలీవర్‌ వేగంగా కదులుతుంది. లేజర్‌ ఆ కదలికల్ని విశ్లేషించి బ్యాక్టీరియాకు సంబంధించిన సంకేతాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతి వేగంగాను, కచ్చితంగాను పనిచేస్తుందని, అలాగే యాంటీబయోటిక్‌ మందుల మోతాదుల్ని నిర్దిష్టంగా నిర్ణయించడంలో కూడా ఇది వైద్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జియోవాని డైట్లర్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు.

  • Loading...

More Telugu News