: చాలా కాలం తరువాత డాన్స్ చేశాను: చిరంజీవి


చాలా కాలం తరువాత డాన్స్ చేశానని ప్రముఖ నటుడు, కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత 'ఎవడు' ఆడియో వింటూ చాలాకాలం తరువాత తన మనవరాలితో కలిసి డాన్స్ చేశానని చిరంజీవి తెలిపారు. రాజకీయంగా బిజీగా ఉన్న తనకు అభిమానుల మధ్యకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. సినిమాల్లో ఉన్నప్పుడు అభిమానుల మధ్య ఉంటున్నప్పుడు సాధారణంగా అనిపించేదని, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అభిమానులతో కలవడం కుదరడం లేదని చిరంజీవి అన్నారు.

మనసావాచా నమ్మితే ఏదైనా జరిగి తీరుతుందని, అలాగే తానీ రోజు ఈ 'ఎవడు' ఆడియో పంక్షన్ కు హాజరవడం కూడా అలాంటిదేనని అన్నారు. రెండేళ్ల క్రితం 'ఎవడు' సినిమా కథతో వంశీ పైడిపల్లి తనను కలిశాడని, అయితే కథని సరిగ్గా డీల్ చేయకపోతే అట్టర్ ఫ్లాపవుతుందని తెలిపానని, నిన్ని రషెస్ చూశాక తనకు నమ్మకం కలిగిందని అయన అన్నారు. చరణ్ సినిమాలో మగధీర తరువాత 'ఎవడు' సినిమా దాన్ని మించిన హిట్ అవుతుందని చిరంజీవి తెలిపారు.

తన మిత్రుడు కమలహాసన్ కుమార్తె తన కుమారుడితో నటించడం ఆనందంగా ఉందన్నారు. తన మనవరాలితో కలిసి డాన్స్ చేసేంత అద్భుతమైన మ్యూజిక్ దేవీశ్రీప్రసాద్ ఇచ్చాడని చిరంజీవి తెలిపారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు ఉత్తరాఖండ్ బాధితుల సంక్షేమం నిమిత్తం ఇచ్చిన విరాళాలను స్వీకరించారు.

  • Loading...

More Telugu News