: అన్ని మ్యాచులూ గెలవలేం: కోహ్లి
ఆడిన ప్రతి మ్యాచూ గెలవడం అసాధ్యమని భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తెలిపాడు. ముక్కోణపు సిరీస్ లో భాగంగా భారత్ పై వెస్టిండీస్ వికెట్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'బాగానే ఆడాం. కానీ ఓడాం. ఆడిన ప్రతి మ్యాచూ గెలవడమంటే అసాధ్యమే. ఇక వెస్టిండీస్ జట్టులో జాన్సన్ చార్లెస్ చాలా బాగా ఆడాడు. విండీస్ జట్టులో ఓ కొత్త ఆటగాడు ఇలా ఆడడం సంతోషమే' అంటూ ప్రశంసించాడు కోహ్లి.