: ఆంధ్రా పోలీస్ గొప్పమనసు


ఆంధ్రా పోలీస్ అంటే కరకు గుండె అని, అణచివేతకు మరోపేరు అని అందరూ అనుకుంటుంటారు. అయితే, తాము గొప్ప మనసున్నవారమని తాజాగా చాటుకున్నారు. ఉత్తరాఖండ్ బాధితుల కడగండ్లకు కరిగిపోయిన పోలీసు శాఖ బాధితులకు వితరణ ప్రకటించి ఆకట్టుకుంది. ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకునేందుకు 2 కోట్ల రూపాయల విరాళాన్ని డీజీపీ దినేష్ రెడ్డి చేతుల మీదుగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. లక్డీకాపూల్ లో కొత్తగా నిర్మించిన సీఐడీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎంకు ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులకు అందజేసిన వాహనాలను కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

  • Loading...

More Telugu News