: మాట్లాడే సిగరెట్ ప్యాకెట్లు!


సిగరెట్ ప్యాకెట్లు మాట్లాడితే.. మనిషి విభ్రమాశ్చర్యాలకు లోనవుతాడేమో! త్వరలోనే ఈ విషయం వాస్తవరూపం దాల్చనుంది. ఇంగ్లండ్ లోని స్టెర్లింగ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ దిశగా ముందడుగు వేశారు. పొగాకు మాన్పించేందుకు ఈ తరహా సిగరెట్ ప్యాకెట్లు చక్కగా ఉపయోగపడతాయని వారు అంటున్నారు. ఈ ప్యాకెట్లలో రెండు రకాల సందేశాలు రికార్డు చేస్తారట. ఒకటేమో.. ఫోన్ నెంబర్ ను ఆఫర్ చేస్తుంది. ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే సిగరెట్ మానడం ఎలా అన్న విషయాలను విశదీకరిస్తారు. ఇక రెండో సందేశం .. సిగరెట్ తాగితే వంధ్యత్వం సంప్రాప్తిస్తుందని కాస్తంత కటువుగానే వినిపిస్తుందట. సిగరెట్ ప్యాకెట్ మూత ఎప్పుడు తెరిచినా ఈ మెసేజ్ లు వినవస్తాయని, దాంట్లో ప్లేబ్యాక్ యూనిట్ అమర్చామని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News