: రాష్ట్రాన్ని విభజిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమే: శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్రాన్ని విభజిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని కడపజిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విడగొట్టడం ఎవరివల్లా కాదని అన్నారు. రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచడానికి ప్రజలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజామోదం లేనిదే రాష్ట్రాన్ని విడదీయలేరన్న శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్రాన్ని విడదీస్తే ప్రాణత్యాగానికైనా తాను సిద్దమన్నారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు.