: గ్రూప్-1 కీలో తప్పులు.. నియామకాలపై హైకోర్టు స్టే
ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ లోపాలు మరోసారి వెల్లడయ్యాయి. గ్రూప్-1 నియామకాలు నిలిపేయాలంటూ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లినట్టు కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, నియామకాలకు అభ్యంతరం చెప్పిన కోర్టు, ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగించవచ్చని పచ్చజెండా ఊపింది. నిపుణుల కమిటీని నియమించి తప్పులను సరిదిద్దాలని హైకోర్టు ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది.