: యువతిపై మూడురోజుల పాటు అత్యాచారం.. నిందితుల అరెస్టు


మృగాళ్ళు మరోసారి రెచ్చిపోయారు. నాసిక్ లో ఓ అమ్మాయిపై మూడురోజుల పాటు దారుణంగా అత్యాచారం జరిపారు. మొత్తం ఐదుగురు కామాంధులు ఈ లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరిలో ఓ మైనర్ కూడా ఉండడం విస్తుగొలుపుతోంది. వివరాల్లోకెళితే.. పింపల్ గావ్ గ్రామానికి చెందిన బాధిత బాలిక ఓ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గానూ, చిత్ర పరిశ్రమలో గ్రూప్ డ్యాన్సర్ గానూ పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన కిరణ్ పాటిల్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు విధులు ముగిసిన తర్వాత ఆమెను తన బైక్ పై ఎక్కించుకుని నాసిక్ తీసుకెళ్ళాడు.

అక్కడ ఆమెను ఓ ఫ్లాట్ కు తీసుకెళ్ళగా.. అక్కడ అప్పటికే అతని మిత్రులు ఉమేశ్, సాగర్, కేతన్, మైనర్ బాలుడు బంటీలు మద్యం తాగుతూ ఉన్నారు. వీరందరూ ఆ బాలికను బెదిరించి లొంగదీసుకుని ఒకరి తర్వాత ఒకరుగా తెల్లవారే వరకు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. అంతేగాకుండా, ఆ అమ్మాయిని ఆ ఫ్లాట్ లోనే ఉంచి మూడు రోజులపాటు పదేపదే నరకం చూపించారు. ఎట్టకేలకు ఆమెను విడిచిపెట్టిన ఆ నరరూప రాక్షసులు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

అయితే, ఇంటికి చేరిన తర్వాత ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. వారిలో మైనర్ బాలుడు బంటీని బాలనేరస్తుల పునరావాస కేంద్రానికి తరలించారు. మిగతావారికి జులై 10 వరకు రిమాండ్ విధించారు.

  • Loading...

More Telugu News