: ఆ 16 దేశాల్లో ఎక్కువసేపు కష్టపడతారట
ఉద్యోగులు సాధారణంగా రోజూ నిర్ణీత వేళలపాటు పనిచేస్తుంటారు. కొన్ని దేశాలలో మాత్రం ఉద్యోగులు ఎక్కువ సమయం పాటు పని చేస్తుంటారు. ఇలా వార్షికంగా ఎక్కువ గంటలపాటు పనిచేసే దేశాల జాబితాను ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్ మెంట్(ఓఈసీడీ) వెల్లడించింది.
ఏడాదికి దక్షిణ కొరియా వాసులు సగటున 2193 గంటల పాటు కష్టపడతారట. గ్రీస్(2109 గంటలు), చిలీ(2068), రష్యా(1976), హంగరీ(1961), పోలండ్(1939), ఇజ్రాయెల్(1889), ఈస్తోనియా(1879), టర్కీ(1877), మెక్సికో(1866), స్లోవేక్ రిపబ్లిక్(1786), అమెరికా (1778), ఇటలీ(1778), న్యూజిలాండ్(1758), జపాన్ లో సగటున 1733 గంటలపాటు పనిచేస్తారట. కానీ, ఓఈసీడీ భారత్ గురించి మాత్రం పేర్కొనలేదు. కానీ, దేశంలోనూ అధిక పనివేళల వాతావరణం వచ్చేసింది. ప్రైవేటు రంగంలో పని వ్యవధి 8 నుంచి 9 గంటల పాటు ఉంటోంది. మరి ఈ లెక్కన చూస్తే భారత్ కూడా టాప్ ప్లేస్ లోనే ఉండాలి.