: మా అబ్బాయి విషయం నాకెందుకు?: సల్మాన్ తండ్రి
సల్మాన్ ఖాన్ పెద్దవాడయ్యాడని, అతనేం చేస్తే తనకేంటని అంటున్నారు సలీమ్ ఖాన్. రచయిత అయిన సలీమ్ ఖాన్ కు ముగ్గురు పుత్రులు కాగా వారిలో రెండోవాడే సల్మాన్ ఖాన్. ఇటీవల సల్మాన్ తన తాజా చిత్రం 'మెంటల్' షూటింగ్ కోసం హైదరాబాద్ రాగా ఆయన వెంట గాళ్ ఫ్రెండ్, రుమేనియా యాంకర్ లులియా వాంచూర్ కూడా దర్శనమిచ్చింది. వారిద్దరూ ఒక్కటవ్వనున్నట్టు గతకొంతకాలంగా మీడియా కోడైకూస్తోంది. ఈ విషయమై సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ ను స్పందన కోరగా.. సల్మాన్ ఎదిగాడని, అతని వ్యక్తిగత విషయాల్లో తాను వేలుపెట్టబోనని కరాఖండీగా చెప్పేశాడు.