: షర్మిల గుండె తరుక్కుపోతోందట!


మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల, రాష్ట్రంలో రైతుల వెతలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించారు. వేసిన పంట కరెంటు లేక, నీరు రాక కళ్ళముందే ఎండిపోతుంటే.. సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని ఆమె విమర్శించారు. పాదయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా కోటపాడులో మాట్లాడుతూ, ప్రభుత్వంపైనా, ప్రతిపక్షంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సర్కారుకు రైతులపై శ్రద్ధ లేదని, చంద్రబాబు సీఎంగా వ్యవహరించిన కాలంలో ఆయనా పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో జరిగిన మేలు గురించి రైతులు వివరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News