: తెలుగులో వస్తున్న 'వీరప్పన్' సినిమా
తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రం 'వీరప్పన్'. ఈ సినిమాలో అర్జున్, రవికాలే, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏఎంఆర్ రమేశ్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ త్రిభాషా చిత్రం తమిళంలో వనయుద్ధం, కన్నడంలో అట్టహాస పేరిట విడుదలైంది. అర్థశతదినోత్సం దిశగా దూసుకెళుతోన్న ఈ సినిమాను వీరప్పన్ పేరుతో తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తామని దర్శకనిర్మాత రమేశ్ తెలిపారు.
ఈ చిత్ర కథాంశం కోసం పదేళ్ళు శ్రమించానని ఆయన వెల్లడించారు. వీరప్పన్ పుట్టుక నుంచి చనిపోయేవరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే తమ చిత్రమని రమేశ్ చెప్పారు. తెలుగులోనూ ఈ గంధపు చెక్కల స్మగ్లర్ జీవితకథ విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.