: తెలంగాణ తెచ్చేది మేమే: మధుయాష్కీ


తెలంగాణ రాష్ట్రం తెచ్చేది తామేనని చెబుతున్నారు ఎంపీ మధుయాష్కీ గౌడ్. ప్రత్యేక రాష్ట్రం సాకారమవ్వాలంటే అది జాతీయ పార్టీ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన చెప్పారు. ఉద్యమం పేరుతో కొన్ని పార్టీలు వసూళ్ళకు పాల్పడుతున్నాయని పరోక్షంగా టీఆర్ఎస్ పై వ్యాఖ్యానించారు. నిజాం కళాశాలలో నేడు జరగనున్న తెలంగాణ సాధన సభలో మధుయాష్కీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ సభకు సోనియా ఆశీస్సులున్నాయని తెలిపారు. అధినేత్రి అనుమతితోనే సభ నిర్వహిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలమంతా ఏకతాటిపై నడుస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News