: వినియోగదారులకు విద్యుత్ షాక్


విద్యుత్ వినియోగ దారులపై సర్ ఛార్జీ రూపంలో షాకిచ్చేందుకు విద్యుత్ నియంత్రణ మండలి రంగం సిద్దం చేసింది. సర్ చార్జీ రూపంలో 542 కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతిచ్చింది. యూనిట్ కు ఒక రూపాయి సర్ చార్జీ వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించగా దాన్ని 49 పైసలకు తగ్గించింది నియంత్రణ మండలి. 2012-13 సంవత్సరం చివరి త్రైమాసికానికి 1137 కోట్ల రూపాయల సర్ చార్జీ వసూలు చేయడానికి డిస్కంలు ప్రతిపాదించాయి. దీనిపై ఈ నెల 12న బహిరంగ విచారణ నిర్వహించి, వినియోగదారుల అభిప్రాయాలు సేకరించిన తరువాత విద్యుత్ నియంత్రణ మండలి 542 కోట్లు వసూలు చేయాలని ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News