: అవిశ్వాసంపై టీడీపీ ఎందుకు స్పందించదు?: మైసూరారెడ్డి


ప్రభుత్వం మైనారిటీలో పడినా ప్రధాన విపక్షం టీడీపీ, అవిశ్వాస తీర్మానంపై ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఉత్తుత్తి విమర్శలు, ప్రకటనలు చేయడం కాదనీ, చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలనీ ఆయన అన్నారు.

ప్రజల తరపున టీడీపీ పోరాడదలచుకుంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో 
అవిశ్వాస తీర్మానం పెట్టి తీరాలని మైసూరారెడ్డి డిమాండు చేశారు. ఒకవేళ పెట్టకపోతే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుందనీ, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించాలనీ మైసూరా అన్నారు. అవిశ్వాసం పెట్టడం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యతని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News